రాష్ట్రస్థాయి వెటరన్ షటిల్ పోటీలకు పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న వెటరన్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా జట్టు గురువారం పయనమైంది. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి మొత్తం 30 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా జట్టుకు కోచ్ అండ్ మేనేజర్‌లుగా వై.కుసుం బచ్చన్, నున్న సురేష్‌లు వ్యవహరించనున్నారు. ఈ బృందంలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది మంది క్రీడాకారులు కుసుం బచ్చన్, టీఎల్.సుబ్బారావు, మల్లికార్జునరావు అపర్ణ బాబా, గణేష్, నవీన్‌కుమార్, ఖలీ లుల్లా, ఎం. శ్రీను, పైడిరాజు పాల్గొననున్నారు. ఈ బృందానికి జిల్లా గుర్తింపుతో టీ షర్ట్స్‌ను జిల్లా సంఘం చైర్మన్ ఇందుకూరి రఘురాజు బహుకరించగా, జిల్లా బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కేఏ నా యుడు జిల్లా సంఘం ద్వారా క్రీడాకారులకు ప్రవేశరుసుము, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లిస్తున్నారు. జి ల్లా జట్టుకు అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపి రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment