చికెన్ వినియోగంపై అపోహలు వద్దు
● జిల్లాలో బర్ట్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేవు
● హెూటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు
విజయనగరం: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేనని, చికెన్ వినియోగంపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా హోటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని మయూర హోటల్‌లో జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నాగుల్ మీరా పాల్గొని ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు మీడియా సహకారం కావాలని కోరారు. కేవలం రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాల్లో మాత్రమే బర్డ్‌ఫ్లూలక్షణాలు కనిపించాయని, విజయనగరం జిల్లాలో ఎటువంటి లక్షణాలు లేవన్నారు. హోటల్స్ పరంగా తాము నిత్యం దాడులు నిర్వహిస్తున్నామని, ఎవరైనా కల్తీ చేసినట్లు నిరూపితమైతే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. హోటల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పుకార్లు రావడంతో హోటల్స్ వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయన్నారు. ప్రజలు చికెన్ వినియోగింవచ్చన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నవీన్, శ్రీనివాసరావు, కాళ్ల సునీల్, మహమ్మద్ అకితుల్లా, రోహిత్, ఈశ్వర్, పఠన్, చందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment