నిందితుడి అరెస్ట్
● తక్కువ ధరకే బొలెరో ఇప్పిస్తానని చెప్పి మోసం..
కొరాపుట్: బొలెరో తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని కొరాపుట్ జిల్లా పొలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కొరాపుట్ ఎస్‌ఐ కృష్ణకుమారి ప్రదాన్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 27వ తేదీన కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలాబ్‌నగర్‌కు చెందిన ఎస్.జయసేన్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కటక్ చెందిన ప్రదోష్ పాత్ర తనకు తక్కువ ధరకే బొలెరో వాహనం విక్రయిస్తానని మోసం చేశారు. తమ సంస్థ వివిధ వేలం పాటలలో పాల్గొని తక్కువ ధరకే వాహనాలు కొని స్వల్ప లాభానికే విక్రయిస్తుంటామని చెప్పాడు. అందుకు తగిన ఫొటోలు చూపించాడు. ప్రదోష్ మాటలు నమ్మిన జయసేన్ రూ.6.35 లక్షలు ఇచ్చాడు. కొన్నిరోజుల తర్వాత ప్రదోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అతని నివాసం వద్దకు వెళ్లి చూసేసరికి ఖాళీ చేసి ఉంది. మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు గతంలో ఉపయెగించిన ఫోన్ నంబర్లు, సీడీఆర్, ఐఎంఈఐల ద్వారా కొత్త ఫోన్ నంబర్ కనిపెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ..2 లక్షల నగదు, 7 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment