గోవుల వాహనాలు సీజ్
సరుబుజ్జిలి: కబేళాకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 28 గోవులను పట్టుకున్న ట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. హిరమండ లం నుంచి వాహనాల్లో పశువుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో గురువా రం సరుబుజ్జిలి జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు వాహనాల్లో ఉన్న 8 మందిని విచారణ చేయగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గోవుల ను కొనుగోలుకు చేసి కబేళాకు తరలించినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. వీరిపై కేసు లు నమోదు చేసి వామనాలను సీజ్ చేసి ఆమ దాలవలస జూనియిర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. గోవులను విజయనగరం జిల్లా గుర్జంగివలస గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఇన్‌చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జగన్నాయకులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అదనపు జడ్జి కోర్టు, జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సోంపేట కోర్టు పీపీ దువ్వు జగన్నాయకులు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టుకు వచ్చిన ఈయన న్యాయమూర్తులను, బార్ సభ్యుల ను, ఇప్పటి వరకు పీపీ బాధ్యతలు నిర్వర్తించి న వాన కృష్ణచంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బార్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ని సూర్యారావు, జిల్లా బార్ ప్రతినిధులు మరిసర్ల అన్నంనాయుడు, బీసీ న్యాయ వాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, ఎన్.శ్రీరామమూర్తి, బొత్స సుదర్శన్, టి.రామారావు, ఎన్.దుర్గా శ్రీనివాసరావు, జి.వెంకటేష్ పాల్గొన్నారు.
పట్టుబడిన వాహనం
Comments
Please login to add a commentAdd a comment