తీగ లాగితే..
జయపురం: జయపురం హటపోదర్‌లో ఒక ట్రాక్టర్ షోరూంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను కదిలిస్తే.. దొంగతనాల చిట్టా బయటపడింది. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ గురువారం జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7.30 గంటల సమయంలో జయపురం హటపొదర్ ప్రాంతంలో గెంబలి సోమేశ్వర రావు కుమారుడు గెంబలి వసంతరావు కోణార్క్ ఎంటర్‌ప్రైజర్స్ యజమాని పట్టణ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో.. 17వ తేదీ తెల్లవారు జాము 2.30 గంటలు–3 గంటల మధ్య కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు తన జాన్ డియర్ ట్రాక్టర్ల షోరూంలో ఐరన్ సేఫ్టీ లాకర్‌ను దొంగిలించారని, ఆ లాకర్‌లో రూ.2 లక్షల 50 వేల నగదు తో పాటు విలువైన లేండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు షోరూం టాప్ పై ఉన్న రూఫ్‌ను తొలగించి పై నుంచి తాళ్లతో ఐరన్ సేఫ్టీ లాకర్ ను బయటకు తీసి దొంగిలించారని నిర్ధారించారు. ఎస్‌ఐ ఎస్‌కే బెహరా తన పోలీసు సిబ్బందితో దర్యాప్తు జరుపుతూ దొంగల క్లూ తెలుసుకున్నారని, పోలీసులు రింకు బెనియ అనే వ్యక్తి ఇంటిపై రైడ్ చేసి దొంగను అదుపులోనికి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో అతడిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడని, ఆ దొంగతనంలో మరో ముగ్గురు ఉన్నారని వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడు రింకు బెనియ మరికొన్ని దొంగతనాలు వివరాలు కూడా వెల్లడించాడు. హటపోదర్‌లో గల స్టోన్ వరల్డ్ మార్బుల్ షోరూంలో ఒక ప్రింటర్‌తో పాటు క్యాష్ కౌంటింగ్ యంత్రాన్ని, మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అలాగే జయపురం ఎన్‌కేటీ రోడ్డులో సారవతీ ఏజన్సీస్ కొకొకొలా షోరూంలో రెండు పెద్ద సంచులలో డైరీ మిల్క్ చాకెట్లు దొంగిలించాడు. వీటి విలువ రూ.92,261లు ఉంటుంది. అలాగే హటపొదర్‌లో ఒక కాజు ఫ్యాక్టరీలో రూ.10 వేల నగదు దొంగిలించినట్లు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. జయపురం బైపాస్ రోడ్డులో ఒక గ్రాసరీ షాపులో ఒక మిక్చర్ బేగ్, ఒక హోమ్ థియేటర్‌లను దొంగిలించినట్లు వెల్లడించాడని తెలిపారు. అలాగే బరిణిపుట్ గ్రామంలో యమహా షోరూంలో 31 స్మార్ట్ వాచ్‌లు దొంగిలించాడు. నిందితుడు ఇచ్చిన వివరణ ఆధారంగా పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాంధీ చౌక్ సమీప కెనాల్‌లో వెతికించగా 6 గంటలు గాలించిన తర్వాత ఐరన్ సేఫ్టీ లాకర్ బయటపడింది. తర్వాత మరో నిందితుడు కను ముదులి ఇంటిపై పోలీసులు దాడి జరిపినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు దొంగిలించిన సామానులు పారాబెడ లో ఎల్‌ఎన్ స్టోర్స్ యజమాని జి.సూర్యనారాయణ పాత్రోకు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. ఆ సామాన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దొంగతనాల్లో నిందితులు బిజయ బెనియ ఉరఫ్ రింకు బెనియ(23)కను ముదులి (19)జి.సత్యనారాయణ పాత్రో(26) లపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పత్రికా ప్రతినిధు సమావేశంలో ఎస్.పివర్మ తో పాటు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, జయపురం పట్టణ పోలీసు ఇన్‌చార్జ్ ,సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంధ్ర తండి పాల్గొన్నారు.
తీగ లాగితే..
తీగ లాగితే..
Comments
Please login to add a commentAdd a comment