బిడ్డ జననం.. తండ్రి మరణం
కొరాపుట్: బిడ్డ పుట్టిన ఆనందం అనుభవించేలోపే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కొరాపుట్ జిల్లా నందపూర్‌కి చెందిన హనీఫ్ ఖాన్ (40) సతీమణి నందపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ప్రసవించారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడంతో వైద్యుల సూచన మేరకు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకి బాలింత, శిశువుని తరలించారు. వారి అంబులెన్స్‌వెనుకే వేరే కారులో హనీఫ్ వెళ్లారు. ఇదే సమయంలో కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కాలేజీ సమీపంలో ఒక ట్రక్‌ను హనీఫ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అప్పటికే హనీఫ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన తండ్రి, అప్పుడే పుట్టిన నవ జాత శిశువు ఒకే ఆస్పత్రిలో వేర్వేరు వార్డుల్లో ఉండడం విషాదం కలిగించింది.
బిడ్డ జననం.. తండ్రి మరణం
బిడ్డ జననం.. తండ్రి మరణం
బిడ్డ జననం.. తండ్రి మరణం
Comments
Please login to add a commentAdd a comment