60 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం ఉదయం కద్బల్ కూడలి వద్ద పెట్రోలింగ్ చేపట్టారు. ఈ సమయంలో తెలంగాణా ఆటోలో అక్రమంగా గంజాయని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆటోను తనిఖీ చేయగా అందులో 60 కేజీల గంజాయి పట్టుబడింది. బలిమెల వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆటోను తనిఖీ చేయగా.. అందులో మూడు బస్తాల్లో గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరి అరెస్టు చేసి ఎకై ్సజ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులిద్దరూ తెలంగాణా రాష్ట్రానికి చెందిన మెటపల్లి నిస్సంత, దుపత్తి మోహన్‌గా గుర్తించారు. వీరు చిత్రకొండ సమితిలో గంజాయి కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తుండగా పట్టుబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని జిల్లా ఎకై ్సజ్ అధికారి బింబేంద్ర పండా తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ ఆరు లక్షల రూపాయలు ఉంటుందన్నారు. పెట్రోలింగ్‌లో ఎకై ్సజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ అశేష్ కుమార్ నాయిక్, జ్ఞానరంజన్ సాహు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment