కొరాపుట్ జిల్లాకు క్రూజ్ షిప్ సేవలు
కొరాపుట్: పర్యాటక రంగంలో అగ్రస్థానంలో ఉన్న కొరాపుట్ జిల్లాకు మరో మణి హారం రానుంది. ఈ జిల్లాలో కొలాబ్ డ్యాంలో క్రూజ్ షిప్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు ప్రకటించారు. అక్కడ క్రూజ్ షిప్ సేవల కోసం జెట్టీ నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. అందుకోసం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. పర్యాటక రంగంలో కొరాపుట్ జిల్లాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. మరోవైపు కొరాపుట్ కలెక్టర్ వీ.కీర్తి వాసన్ కూడా ఆదివారం మీడియా ముందు ఈ విషయం ధ్రువీకరించారు. ఇది వరకే క్రూజ్ షిప్ కోసం నిపుణులు కొలాబ్ డ్యాం లో పరిశీలనలు పూర్తి చేశారు. అందుకోసం ప్రథమ సర్వే పూర్తయిందని కలెక్టర్ ప్రకటించారు.
కొరాపుట్ జిల్లాకు క్రూజ్ షిప్ సేవలు
కొరాపుట్ జిల్లాకు క్రూజ్ షిప్ సేవలు
Comments
Please login to add a commentAdd a comment