వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం
పర్లాకిమిడి: రోజూ అరగంట సైకిల్ తొక్కడం, యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక పాలనాధికారి నివాసగృహాం వద్ద ఆదివారం ఉదయం ఫిట్ ఇండియాలో భాగంగా ‘ఫిట్‌నెస్‌కి డోస్..ప్రతి రోజూ ఉదయం అరగంట’అనే కార్యక్రమాన్ని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ జెండాఊపి ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు ఏడీఎం రాజేంద్ర మింజ్, జిల్లా పరిషత్తు అసిస్టెంటు ఇంజినీరు వెంకట్రావు అచారి, జిల్లా మిషన్ శక్తి అధికారి టిమోన్ బోరా, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా శారీరక క్రీడాధికారి సురేంద్ర కుమార్ పాత్రో, డీపీఆర్‌వో ప్రదీప్ గురుమయి, అధికసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ స్టేట్‌బ్యాంకు, హైస్కూల్ జంక్షన్, ప్యాలస్ వీధి వరకూ కొనసాగింది.
పర్లాకిమిడిలో ‘ఫిట్ ఇండియా’సైకిల్ ర్యాలీ
వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment