గండాహతి, జగన్నాథ మందిర పునర్నిర్మాణానికి నిధులు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని గండాహతి జలపాతాలు, పర్లాకిమిడిలో జగన్నాథ మందిరం పునర్నిర్మాణం కోసం రాష్ట్ర టూరిజం శాఖ రూ.160 లక్షలు కేటాయించిందని మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తెలిపారు. గండాహతి జలపాతాల అభివృద్ధికి రూ.కోటి, శ్రీజగన్నాథ మందిర నిర్మాణానికి రూ.60లక్షల నిధులు కేటాయించినట్టు రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి బాలముకుంద భుయ్యాన్ ఈ మేరకు ఈనెల 21న ప్రభుత్వలేఖను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు చొరవతో గజపతి జిల్లాలో పర్యాటక కేంద్రాలు ఇకపై అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గండాహతి, జగన్నాథ మందిర పునర్నిర్మాణానికి నిధులు
గండాహతి, జగన్నాథ మందిర పునర్నిర్మాణానికి నిధులు
Comments
Please login to add a commentAdd a comment