విద్యార్థిని చదువుకు ఆర్థికసాయం
రాయగడ: నిరుపేద ఆదివాసీ విద్యార్థిని చదువు కోసం జిల్లా యంత్రాంగం ఆర్థిక సహకారాన్ని అందించింది. జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహారో రెడ్ క్రాస్ నిధుల నుంచి విద్యార్థికి 30 వేల రూపాయలను అందించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చంద్రపూర్ సమితి పరిధి హిమబ్రాస్ గ్రామంలో నివసిస్తున్న రింకి సరక తల్లిదండ్రులు ఇదివరకే చనిపాయారు. ఉన్న తన అక్క కర్ణాటక రాష్ట్రంలో ఉపాధి కోసం వెళ్లింది. అక్క పంపించిన కొంత డబ్బులదో పదో తరగతి వరకు చదువుకున్న రింకి అనంతరం పైచదువు కోసం ఆర్థిక స్థోమత లేకపొవడంతో ఇబ్బంది పడుతుండేది. కొంతమంది గ్రామస్తులు ఆమె ధీన పరిస్థితిని జిల్లా యంత్రాంగం దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ పట్వారి రూ. 30 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. విద్యార్థిని రింకి కలెక్టర్ కార్యాలయానికి శనివారం రాగా.. ఆమెకు జిల్లా అదనపు కలక్టర్ కుహారో ఆర్థిక సహాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. జిల్లా యంత్రాంగం ఎంతో ఉదారతతో తనకు ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందని.. నర్సింగ్ కోర్సులో చేరి చదువు పూర్తయిన తరువాత తమ సేవలను అందిస్తానని రింకి చెప్పారు. జిల్లా యంత్రాంగానికి గ్రామస్తులు ఽకృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment