బిసంకటక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
● ముగ్గురి మృతి
● ఇద్దరికి గాయాలు
● బైక్ రేసింగే ప్రమాదానికి కారణం
రాయగడ: బైకు రేసింగ్ సరదా ముగ్గురు ప్రాణాలను బలిగొంది. జిల్లాలోని బిసంకటక్ సమీపంలో ఉన్న భైరవ మందిరం వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం కు చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తలిపిన వివరాల ప్రకారం.. పుటుగుడ గ్రామానికి చెందిన యువకులు జగన్నాథ మినియాక, మిన్నారావు భైరవమందిరం సమీపంలో సోమవారం సాయంత్రం బైకు రేస్ చేస్తున్న సమయంలో బైకు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో టిటిగుడ, రమానకుపులి గ్రామాలకు చెందిన కిరోద్ దుర్గా (23), పురుషోత్తం పట్రిక (24), సదానంద మండంగి (22)లు మృతి చెందంగా.. జగన్నాథ మినియాక, మిన్నారావు అడంగిలు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదంలో రెండు బైకులు నుజ్జునుజ్జయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని రాయగడ అనంతరం బరంపురం ఆస్పత్రికి రిఫర్ చేశారు.
బిసంకటక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
బిసంకటక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
బిసంకటక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment