విద్యుత్ శాఖ కార్యకలాపాలపై సమీక్ష
భువనేశ్వర్: రానున్న వేసవిలో విద్యుత్ నిరంతర సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశించారు. వేసవి కాలంలో విద్యుత్ శాఖ కార్యకలాపాల సన్నద్ధతని ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి విద్యుత్ విభాగం ఉన్నతాధికారులతో అనుబంధ శాఖలు, భాగస్వా మ్య సంస్థల అధికారుల హాజరయ్యారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనలో రాష్ట్రంలో అత్యధికుల్ని చేర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేసవిలో సాధారణం కంటే అధికంగా విద్యుత్ వినియోగంతో ఓవర్‌లోడింగ్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య అధిగమించడానికి ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. విద్యుత్ సరఫరా విభాగంలో బలమైన బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉండాలని ఆదేశించారు. పీక్ అవర్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో సంప్రదించి రాష్ట్రంలో తగినంత విద్యుత్ అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలను ఎండ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment