మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
రాయగడ: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రాంగణంలో మహిళలకు వివిధ పోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ముగ్గులు, కబడ్డీ, ఖో–ఖో, చిత్రలేఖనం తదితర పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మధుస్మిత, అసిస్టెంట్ కలెక్టర్ బిచిత్ర శెఠి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment