● తుపాకీ గురి పెట్టి యువకుడి అపహరణ
● రూ.25 లక్షలు డిమాండ్
జయపురం: జయపురం సమితి, ఉమ్మిరీ గ్రామ పంచాయతీ సౌరగుడ గ్రామం అభిషిత్ సవుర అనే యువకుడిని తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారని, తమను రూ.20 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ మంగళవారం వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. ఈ నెల 2 వ తేదీ సాయంత్రం అభిషిత్ అతడి స్నేహితుడు కలసి బహిర్భూమి కోసం సాయిమందిర సమీప ధన్‌పూర్ బ్రాంచ్ కెనాల్ కు వెళ్లారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు ఒక కారులో వచ్చారు. వారు ముఖం కప్పుకుని ఉన్నారు. వారు తుపాకీ చూపి బెదిరించి అభిషిత్‌ను తీసుకెళ్లిపోయారు. వారు పేపరు మిల్లు మార్గం మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. 3వ తేదీన దుండగులు అభిషిత్ ఇంటిలో ఒకరి ఫోనుకు ఫోను చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని లేదంటే అభిషిత్‌ను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్ పోలీసు సంటి అధికారి సబ్‌ఇన్‌స్పెక్టర్ రాజ కిశోర్ బారిక్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment