బొత్ర సేవలు మరువలేనివి
జయపురం: సమాజ సేవకుడు, విద్యాదాత, కవి, రచయిత, పాత్రికేయుడు, స్వర్గీయ ప్రభుదాన్ బొత్ర సేవలు మరువలేనివి అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం ప్రభుదాన్ బొత్ర స్మృతి సంసద్, ఫోరెన్స్ నైటెంగేల్ ఏఎన్‌ఎం శిక్షణ కేంద్రం జయపురం సంయుక్తంగా బొత్ర నాల్గో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఫోరెన్స్ నైటెంగేల్ ఏఎన్‌ఎం శిక్షణ కేంద్రం సభాగృహంలో డాక్టర్ సుదాంశు శేఖర్ పట్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త, డాక్టర్ సురేష్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని బొత్ర పత్రికా రంగానికి, సాహిత్య రంగానికి అందించిన సేవలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment