గ్లకోమా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం ఫోర్ట్: గ్లకోమా(నీటికాసులు) వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద జెండా ఊపి మంగళవారం ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి అని, కంటి డ్రైనేజీ నిర్మాణాలు సరిగా పనిచేయకపోవడం వల్ల కంటి లోపల పీడనం పెరిగి నరానికి హాని కలుగుతుందని తెలిపారు. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చునన్నారు. క్రమంగా చూపు కోల్పోవచ్చునని హెచ్చరించారు. గ్లకోమా బారిన పడిన చాలామందికి తమకు వ్యాధి ఉందని తెలియదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
Comments
Please login to add a commentAdd a comment