అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు పంచాయతీల్లో ఎన్‌ఆర్‌ఈజీస్ నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ జీవీ రమణ మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని నర్సిపురం, పెదబొండపల్లి, ఎమ్మార్‌నగరం, తాళ్లబురిడి పంచాయతీలలో ప్రత్యేకాధికారి రమేష్ రామన్‌తో కలసి పర్యటించారు. అలాగే ఆయా పంచాయతీల్లో జరుగుతున్న పీ4 సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల్లో భాగంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించినట్లు చెప్పారు. పీ4 సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. తాళ్లబురిడిలో ఇటీవల అంటువ్యాధులకు గ్రామస్తులు పలువురు గురికావడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని, తాగునీటి బోర్లు, రక్షిత పథకాల వద్ద క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment