జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

Published Wed, Mar 12 2025 7:30 AM | Last Updated on Wed, Mar 12 2025 7:26 AM

జూడో

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్‌.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.

అంతర రాష్ట్ర ఫెన్సింగ్‌

క్రీడలకు విద్యార్థి ఎంపిక

విజయనగరం అర్బన్‌: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్‌ క్రీడలో అంతర్‌ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.

ఎకనామిక్స్‌–1 పరీక్షకు 580 మంది గైర్హాజరు

పార్వతీపురంటౌన్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఎకనామిక్స్‌ పరీక్షకు 580మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఒకేషనల్‌ పేపర్‌3, ఎకానమిక్స్‌–1 పరీక్షకు 9540 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8,960మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌కాపీయింగ్‌ జరగలేదని స్పష్టం చేశారు.

30 కేజీల గంజాయి పట్టివేత

పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు దుర్గ గుడి వద్ద 30 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటసురేష్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో దుర్గ గుడి వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మహమ్మద్‌ షఫీజ్‌, దివ్యాన్షు శుక్లా, ఓం శుక్లాల నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

జిల్లా ప్రయాణికుల

లోగో ఆవిష్కరణ

పార్వతీపురంటౌన్‌: జిల్లా ప్రయాణికుల లోగోను కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమసంఘం ఈ లోగోను రూపొందించింది. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు బడే నాగభూషణరావు, తోటపల్లి ట్రస్ట్‌ ట్రెజరర్‌ జి.శ్రీరామచంద్రమూర్తి, డీఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ స్టాఫ్‌ బ్రాండ్‌ ప్రతినిధి భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

గజపతినగరం రూరల్‌/దత్తిరాజేరు: గజపతినగరం మండలంలోని పట్రువాడ, చిట్టేయవలస, దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి, గొభ్యాం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ డైరెక్టర్‌ షణ్ముక్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. ఫారం పాండ్‌లు, ఫిష్‌ పాండ్‌ల నిర్మాణంపై వేతనదారులకు పలు సూచనలిచ్చారు. వేతనదారులకు రోజుకు రూ.300 వేతనం తక్కువ కాకుండా పనులు కల్పించాలని ఫీల్డు అసిస్టెంట్లను ఆదేశించారు. ఉపాధిహామీ పనులతో సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాలుష్య నింయత్రణాధికారి గోపీచంద్‌, డ్వామా పీడీ శారదాదేవి, అడిషనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు1
1/3

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు2
2/3

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు3
3/3

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement