జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులకు మోక్షం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఎస్పీ ఆఫీస్ భవనానికి ఎట్టకేలకు మోక్షం లబించింది. ప్రస్తుత ఎస్పీ వకుల్ జిందల్ చొరవతో దాదాపు రూ.3 లక్షల వ్యయంతో పరిపాలన భవనం మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో చేపడుతున్న పలు అభివృద్ధి, మరమ్మతు పనులను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం పరిశీలించారు. అభివృద్ధి, మరమ్మతు పనులను నాణ్యంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరమ్మతు పనుల పరిశీలనలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాలనాయుడు, ఆర్‌ఎస్సై వర ప్రసాద్ పాల్గొన్నారు.
15తో ముగియనున్న
చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామం వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో చెరకు క్రషింగ్ ఈ నెల 15తో ముగియనుందని యాజమాన్య ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి 3.25లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేసినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ప్రాంతాల నుంచి మిగులు చెరకును ఈ నెల 15లోగా కర్మాగారానికి తరలించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. చెరకు క్రషింగ్‌కు సహకరించిన రైతులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment