యువకుడి అనుమానాస్పద మృతి
రాయగడ: యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. జిల్లాలోని గుణుపూర్ పాతబస్టాండు సమీపంలో ఉన్న గొలావీధి వద్ద యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు గుణుపూర్‌కు చెందిన కరాల్ రాజు (38)గా గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని గొంతు వద్ద గాయాం ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాల కారణంగా యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణం తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment