విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ చేయూత అందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో గురువారం హోమ్ గార్డు కుటుంబానికి సుమా రు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఏడాది పొడవునా హోమ్‌గార్డు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు భార్య వి.సత్యవతికి ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హోమ్‌గార్డ్స్ ఇన్‌చార్జ్ ఆర్‌ఐ ఆర్.రమేష్‌కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ ఏఎస్వీ ప్రభాకరరావు, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియ న్ విశ్వ విద్యాలయంలో జాతీయ ఫార్మసీ విద్యా దినో త్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఔషధ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ ష్రాఫ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫార్మా, పార్మసీ ప్రాక్టీస్‌లో వ్యవస్థాపక స్టార్టప్‌లు ప్రోత్సహించడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పేర్కొందని, ఆ దిశగా విద్యార్ధులు సన్నద్ధం కావాలని సూచించారు.
శిక్షణ ప్రారంభం
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు సెంచూరియన్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్‌ప్రసాద్ గురువారం ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
కుక్కల దాడిలో 10 మేక పిల్లల మృతి
మెంటాడ: లోతుగెడ్డ గ్రామంలో కర్రి అక్కయ్యకు చెందిన 10 మేక పిల్లలు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కయ్య పిట్టాడ గ్రామానికి మేకల మందను మేత కోసం తీసుకువెళ్లి మేక పిల్లలను గూడులో ఉంచాడు. ఆ గూడుపై కుక్కలు దాడి చేసి 10 మేక పిల్లలును చంపివేశాయి. మృతి చెందిన మేక పిల్లల విలువ సుమారు 50 వేల రుపాయలు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు,
Comments
Please login to add a commentAdd a comment