దశాబ్దాలు గడుస్తున్నా.. జంఝాటం వీడటం లేదు. జంఝావతి కంఠ
●పట్టించుకోని కూటమి ప్రభుత్వం ●బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులు ●ఒడిశాతో చర్చలకు ఇదే సమయమంటున్న రైతులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టుకు 1976లో శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.15.51 కోట్ల అంచనా వ్యయంతో దీనిని ప్రారంభించారు. కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ మండలాలకు నీటిని అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి ఒడిశాలో వర్షాలు కురిస్తేనే నదిలో నుంచి వచ్చిన నీటిని ఇక్కడ ఒడిసిపట్టవచ్చు. జలాశయం పూర్తయితే ఒడిశా రాష్ట్రంలోని మూడు గ్రామాలతోపాటు.. కొంత అటవీ ప్రాంతం ముంపు బారిన పడతాయి. దీంతో గేట్ల ఏర్పాటు సవాల్‌గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదమై కూర్చొంది. గతంలో పలు దఫాలు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. నగుల్లువలస, చీకటిలోవ, పిల్లిగుడ్డి గ్రామాల వారికి పునరావాసంతోపాటు.. నష్టపోతున్న ప్రాంతానికి పరిహారం ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. గేట్ల ఏర్పాటుకు మాత్రం ఒడిశా ప్రభుత్వం అంగీకరించలేదు. స్పిల్‌వే దగ్గర పనులు చేసుకునేందుకు మాత్రమే అంగీకరించింది. దీంతో 1980వ దశకంలో కొమరాడ మండలంలోని జంఝావతి ఎగువ, దిగువ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.124 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలిగారు. అప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పూర్తి కాకపోవడంతో రైతులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు సఫలమైతే ఇక్కడి రైతాంగానికి మేలు చేకూరుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ సమస్యపై దృష్టి సారించారు. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అటు నుంచి సానుకూలత రాకపోవడంతో సమస్య కూడా అలానే ఉండిపోయింది.
అసలే వివాదం..
ఆపై అరకొర కేటాయింపులు
పూర్తిస్థాయిలో పనులు జరగకపోవడం వల్ల శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. 27,790 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎగువ కాలువ ద్వారా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాలల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కొమరాడ మండలం డంగభద్ర వద్ద పెద్ద బండరాయి ఉండటంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దిగువ కాలువ నుంచి ఎగువ కాలువకు నీరును ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన పథకం మరమ్మతులకు గురైంది. దీనివల్ల కేవలం 700 ఎకరాలకు మాత్రమే నీరందే పరిస్థితులు ఉన్నాయి. దిగువ కాలువ ద్వారా గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, సీతానగరం మండలాల్లోని 12 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. కాలువ పనులు జరిగినా నీరు మళ్లించే మదుముల వద్ద షట్టర్లు ఏర్పాటు చేయలేదు. పంటభూములకు సాగునీరు చేరేలా పిల్ల కాలువలనుతవ్వాల్సి ఉంది. కొన్నిచోట్ల యూటీలు నిర్మించాలి. ఈ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉన్నా.. కూట మి ప్రభుత్వం కనీసం దృష్టి సారించడం లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో జంఝావతి ప్రాజెక్టుకు కనీస నిధులు కేటాయించక పో వడం పట్ల ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ప్రాజెక్టు వద్ద నిరసన వ్యక్తం చేసింది. జంఝావతికి బడ్జెట్లో ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం దారుణమని చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాల తీ కృష్ణమూర్తి నాయుడు, ప్రతినిధులు వి.దాలినాయుడు, వి.శ్రీహరి, టి.ప్రభాకరరావు, బి.కృష్ణ అన్నారు. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లోనూ కూటమి అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయని.. ఒడిశాతో ఉన్న అతి చిన్న సమస్యను పరిష్కరించడానికి ఇదే మంచి సమయమని తెలిపారు. పాలకులు ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరమన్నారు.
ఆస్ట్రియా సాంకేతికతతో రబ్బరు డ్యాం..
2006లో ఆస్ట్రియా సాంకేతికతతో నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇక్కడ రబ్బరు డ్యాం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 12 వేల ఎకరాలకు నీరివ్వాలని భావించారు. 3.60 కిలోమీటర్ల లింకు కాలువను తవ్వి, డిస్ట్రిబ్యూటరీతో అనుసంధానించడం ద్వారా మరో 12 వేల ఎకరాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు 650 హార్స్ పవర్ గల మూడు మోటార్లను, ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగానైనా చేపట్టిన ఈ ప్రక్రియ వల్లే 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
దశాబ్దాలు గడుస్తున్నా.. జంఝాటం వీడటం లేదు. జంఝావతి కంఠ
దశాబ్దాలు గడుస్తున్నా.. జంఝాటం వీడటం లేదు. జంఝావతి కంఠ
Comments
Please login to add a commentAdd a comment