నరసన్నపేటలో దొంగలు హల్‌చల్
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. పట్టణ శివారులో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉన్న శ్రీనివాసనగర్‌లో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొలుత వీధిలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి పట్నాల నాగేశ్వరరావు ఇంట్లో చొరబడ్డారు. నాగేశ్వరరావు కుటుంబం దైవ దర్శనాల టూర్‌లో ఉండటంతో ఇదే అదునుగా బీరువాను తెరిచి చిందరవందర చేశారు. ఇంటి ముందు సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇంట్లో ఏయే వస్తువులు చోరీకి గురయ్యాయో నాగేశ్వరరావు కుటుంబం తిరిగి వస్తే తప్ప స్పష్టత రాదు. ఈ ఇంటికి సమీపంలో ఉంటున్న పోలాకి మండలం రేవు అంప్లాం పంచాయతీ కార్యదర్శి టి.దుర్గాప్రసాద్ ఇంట్లో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో గేటు విరగ్గొట్టి వెళ్లిపోయారు. గురువారం విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్ చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. కాగా, దేవుడు బొమ్మలతో మూడు చక్రాల రథాలపై కొందరు వచ్చారని, చోరీ వీరి పనే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment