నీలకంఠ సాగర్ అభివృద్ధి పనులపై అసంతృప్తి
జయపురం: జయపురంలో మరో చారిత్రిక పెద్ద చెరువు నీలకంఠ సాగర్ పునరుద్ధరణ, సౌందరీకరణ పనులు సగంలో ఆగిపోయాయి. గురువారం
జయపురం సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి నీలకంఠ సాగర్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, మున్సిపల్ ఇంజినీర్ ఉన్నారు. నీలకంఠ సాగర్ పనులు పరిశీలించిన సబ్ కలెక్టర్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తిచేయాలని, కంట్రాక్టర్‌కు నోటీసు పంపాలని ఇంజినీర్‌ను ఆదేశించారు. మూడేళ్లుగా నీలకంఠ సాగర్ పనులు జరుగుతున్నాయి. నేటికీ ప్రహరీ పనులు పూర్తి కాలేదు. మట్టి తీత, బురద తొలగింపు పనులు కూడా పూర్తి కాలేదు. పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ నీలకంఠ సాగర్‌ను సందర్శించి పనులు వెంటనే పూర్తిచేయాలని కంట్రాక్టర్‌ను ఆదేశించారు. అయినా పనులు సాగటంలేదు. 22 ఎకరాల నీలకంఠ సాగర్‌లో 16 ఎకరాల్లో బురద తొలగించారని తెలుస్తుంది. నీలకంఠ సాగర్ సుందరీకరణలో నాలుగు పక్కల పాద రస్తా, పార్క్, ఓపెన్ జిమ్, జలాశయం మధ్యలో వ్యూ పోయింట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంట్రాక్ట్‌ను నేషనల్ బిల్డింగ్ కన్‌ట్రక్షన్ వారు టెండర్లో దక్కించుకున్నారు. ఈ సంస్థ వారు సబ్ కంట్రాక్టర్లకు ఇచ్చినట్లు తెలిసింది. రూ.9 కోట్ల 58 లక్షల వ్యయంతో నీలకంఠ సాగర్ పునరుద్ధరణ, సౌందర్యీకరణ పనులు చేపట్టారు. ఈ పనులను ఏప్రిల్ నెలలోగా పూర్తి చేయాలని కంట్రాక్టర్‌ను సబ్‌కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment