సంతాన దత్తత స్వీకార చట్టంపై అవగాహన
పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయం మీటింగ్ హాల్‌లో సంతాన దత్తత స్వీకార నూతన చట్టం–2022, మైనర్ బాలికల ఎర్లీ ప్రెగ్నెన్సీని అరికట్టడంపై అధికారులు సమావేశంలో కూలంకషంగా చర్చించారు. జిల్లాలో మైనర్ బాలికల ప్రెగ్నెన్సీ సంఘటనలు అరికట్టాలని, అలాగే వారి సంతానం స్వీకరించే హక్కు ప్రైవేటు వ్యక్తులకు గానీ సంస్థలకు గానీ లేవని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్ అన్నారు. దురదృష్టవశాత్తు మెడికల్‌లో మైనర్ బాలిక నెలలు నిండకుండా ప్రెగ్నెంట్ అయ్యి శిశువుకు జన్మనిస్తే.. మెడికల్ అధికారులు, ఇతర దత్తత కేంద్రాలు శిశు సురక్షా యూనిట్‌కు సమాచారం ఇవ్వాలని అన్నారు. బాల్యవివాహాలు, కుమారీ మాతృత్వ ఘటనలు తగ్గించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సీడీఎంఓ డాక్టర్ ఎంఎం అలీ అన్నారు. సమావేశంలో జిల్లా శిశు సురక్షా సమితి అధ్యక్షులు అశ్వినీ కుమార్ మహాపాత్రో, జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సబ్ డివిజనల్ పోలీసుఅధికారి మాధవానంద నాయక్, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని మనోరమాదేవి, సాధన వ్యక్తి ఘాసిరాం పండా, మరియు చైల్డ్‌లైన్, ఒన్ స్టాప్ సెంటర్ అధికారులు పాల్గ్గొన్నారు.
సంతాన దత్తత స్వీకార చట్టంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment