అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
జయపురం: వేసవి కాలంలో అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అటవీ విభాగ అధికారులు మంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అడవుల్లో ఎక్కడ అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే తెలుసుకునేందుకు మంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జయపురం అటవీ రేంజర్ సచ్చిదానంద పొరిడ వెల్లడించారు. మొదటిసారిగా పినాంగి సంరక్షణ అడవిలో గురువారం మంచ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కొరాపుట్ ఘాట్ రోడ్డు, పాత్రోపుట్ ప్రాంతాల్లో మంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడవులను అగ్నిప్రమాదాల నుంచి రక్షించేందుకు కొండలపై మంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంచ్ ఎత్తు 15 అడగుల ఉంటుందని, మంచ్‌పై కూర్చొనేందుకు పది అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంచ్‌పై అటవీ ఉద్యోగులు కూర్చుంటారని, ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు మంచ్‌పై చుట్టూ పరిశీలిస్తారన్నారు. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా తెలుసుకుని వెంటనే అటవీ విభాగ అధికారులు తెలియజేస్తారన్నారు. వెంటనే మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టటం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment