నేడు జమ్మి ఎల్లమ్మ జాతర
జయపురం: స్థానిక గోపబంధు నగర్‌లో శుక్రవారం జమ్మి ఎల్లమ్మ జాతర నిర్వహించనున్నారు. గత గురువారం నుంచి ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. శుక్రవారం గోపబందు నగర్ నుంచి పట్టణ ప్రధాన మార్గంలోగల బంకమఠం వద్ద జాతర ముగియనుంది. ఈ సందర్భంగా బాల బాలికలు ఉదయానే ప్రతి ఇంటికి వెళ్లి జోగి దండుతారు. వాటిని జమ్మి ఎల్లమ్మ జాతరలో సమర్పిస్తారు. తెలుగు వారు సిర్లి పండగగా పిలుస్తారు.
230 కిలోల గంజాయి స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు బుధవారం రాత్రి 15 బస్తాల్లోని 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో గల నీలకంబేరు పంచాయతీ కండాగూఢ గ్రామం అడవిలో 15 బస్తాల గంజాయి ఉందని బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయక్‌కు సమాచారం రావడంతో ఆయన బుధవారం రాత్రి తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. వారి రాకను గమనించి గంజాయి బ్యాచ్ పరారైపోయింది. పోలీసులు బస్తాలు స్వాధీనం చేసుకుని గురువారం తూకం వేయగా 230 కిలోలు కనిపించింది. మొత్తం 15 బస్తాల్లో దీని విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
దుకాణాలు దగ్ధం
భువనేశ్వర్: పారాదీప్ ప్రాంతంలో 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దుకాణదారులు గాయపడ్డారు. స్థానిక దోఛొక్కి గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 3 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆర్పే ప్రయత్నంలో దుకాణదారులకు గాయాలయ్యాయి. కుజంగ్ అగ్నిమాపక దళం ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది.
అత్యాచారం కేసులో
నిందితుడి అరెస్టు
రాయగడ: అత్యాచారం కేసుకు సంబంధించి జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసి గురువారం కోర్టుకు తరలించారు. అరైస్టెన వ్యక్తి టికిరి పంచాయతీలోని కలియాకొన గ్రామానికి చెందిన ప్రకాష్ మాఝిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కలియాకొన గ్రామానికి చెందిన ఒక దివ్యాంగురాలు తన తల్లితో కలిసి గ్రామ సమీపంలోని అడవిలో కట్టెలు తీసుకొచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో దివ్యాంగురాలు ఒక చెట్టుకింద ఉండడం గమనించిన ప్రకాష్ ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో మానసిక దివ్యాంగురాలైన తన కూతురుపై అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి టికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
నేడు జమ్మి ఎల్లమ్మ జాతర
నేడు జమ్మి ఎల్లమ్మ జాతర
Comments
Please login to add a commentAdd a comment