సుభద్ర పథకంపై అవగాహన
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు తీసుకొచ్చిన సుభద్ర పథకంపై అందరికీ అవగాహన కలిగేలా జిల్లా యంత్రాంగం చైతన్య, ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జిల్లాలోని కొలనారలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ర్యాలీలో బీరీనా ప్రధాన్, సీడీపీవో బిజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment