రాయగడ: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిజు పట్నాయక్ జయంతిని పురష్కరించుకుని ఏటా మార్చి 5 న జరుపుకునే పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని రద్దు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల బిజు పట్నాయక్ విగ్రహం వద్ద బీజేడీ నాయకులు, మహిళా కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. జననాయకుడు బిజుకి బీజేపీ ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సుమారు రెండు గంటల పాటుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలొ ఆ పార్టీ మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గంగాధర్ పువ్వల, సుజాత పాలొ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment