అభివృద్ధికి ఆమడ దూరం
రాయగడ: జిల్లాలోని కొలన సమితి పరిధిలో ఉన్న మండియాడొంగొ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సుమారు 60 కుటుంబాలకు చెందిన 150 మందికి పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. ఎత్తయిన కొండపై ఉండే ఈ గ్రామానికి వెళ్లేందుకు రాళ్లుతేరిన రహదారే దిక్కు. గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టేందుకు మనోరేగ పథకంలో ప్రతిఏటా నిధులు మంజూరవుతున్నాయి. అయితే ఆ నిధులతో మట్టిని పోసి చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పంచాయతీ కార్యాలయం, 28 కిలోమీటర్ల దూరంలో సమితి కార్యాలయం ఉంది. గ్రామంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో దాదాపు పది మంది విద్యార్థులు చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇకపోతే గ్రామంలో తాగునీటి సమస్య వెంటాడుతోంది. 150 మందికి కేవలం ఒకే గొట్టపుబావి ఉండడంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. సమస్యను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి అంబులెన్స్‌లు చేరుకోవడం లేదని, దీంతో రోగులను మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుపుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.
మండియాడొంగొలో మౌలిక
సదుపాయాలు కరువు
అభివృద్ధికి ఆమడ దూరం
అభివృద్ధికి ఆమడ దూరం
Comments
Please login to add a commentAdd a comment