కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం

Published Sat, Mar 8 2025 1:40 AM | Last Updated on Sat, Mar 8 2025 1:38 AM

కొరాప

కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం

కొరాపుట్‌: కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాలకు మణిహారంగా భారత మాల రోడ్డు నిలవనుంది. దీని నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తి కావచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్డు నిర్మిస్తోంది. విశాఖ పట్నం నుంచి రాయపూర్‌ వరకు 6 అంచెల ఎకనామిక్‌ కారిడార్‌గా రూపు దిద్దుకుంటోంది. దీని నిర్మాణం కోసం సుమారు రు.20 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల మీదుగా ఈ నిర్మాణం కొనసాగింది. కొరాపుట్‌ జిల్లాలకు రావాలంటే ఘాట్‌ రోడ్లు ఉంటాయనే ప్రచారం ఉంది. కానీ ఈ రోడ్డులో ఎక్కడా ఘాట్‌ రోడ్డు లేకుండా కొండల కింద నుంచి సొరంగాలు నిర్మించారు. ఈ రోడ్డు ఒడిశాలో కేవలం కొరాపుట్‌,నబరంగ్‌పూర్‌ జిల్లాల నుంచి మాత్రమే వెళ్లనుంది. 464 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం 1
1/2

కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం

కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం 2
2/2

కొరాపుట్‌ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement