కాంగ్రెస్ వాకౌట్
భువనేశ్వర్: శాసన సభలో మలి విడత బడ్జెటు సమావేశాలు పురస్కరించుకుని సభలో తలెత్తిన పరిస్థితులకు నిరసనగా కాంగ్రెసు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన ప్రదర్శించారు. రాష్ట్రంలో సగటు మహిళకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అత్యాచారాలు నిత్య కృత్యాలుగా పరిణమిస్తున్నాయని, పాఠశాలల్లో మైనరు బాలికలు విద్యాబుద్ధులు సాధించడం బదులుగా గర్భం దాల్చడం వంటి సిగ్గు చేటు సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ చర్యల పట్ల ప్రభుత్వ స్పందన శూన్యంగా పరిణమించిందని కాంగ్రెసు సభ్యులు ఆరోపించారు. హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తక్షణమే మౌనం వీడి సభలో వివరణ ప్రవేశ పెట్టాలని సభ్యులు పట్టుబట్టారు. వీరి వాదనను స్పీకరు పట్టించుకోకపోవడంతో నిరసనగా సభ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన ప్రదర్శించారు.
కాంగ్రెస్ వాకౌట్
Comments
Please login to add a commentAdd a comment