రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హర
భువనేశ్వర్: జస్టిస్ హరీష్ టండన్ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది. ఆయన ప్రస్తుతం కోల్‌కతా హై కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2010 సంవత్సరం ఏప్రిల్ నెల 13 నుంచి కోల్‌కతా హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. 2025 సంవత్సరం జనవరి 19న రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ శాశ్వత పదవి ఖాళీ అయింది. సుప్రీం కోర్టు కొలీజియం ఒడిశా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హరీష్ టండన్‌ను సిఫార్సు చేయడంతో ఈ ఖాళీ భర్తీ కానుంది.
అడవిలో యువకుడి
మృతదేహం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఛలాన్‌గూఢ పంచాయతీ పరిధిలోని సమీప అడవిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం కనిపించిందని మల్కన్‌గిరి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న జీతు అనే యువకుడు డోంబురు,జానీ,రాహుల్ కచిమ్ అనే ముగ్గురు యువకులతో రిక్లమేషన్‌కాలనీకి చెందిన ఆశిష్ హల్దార్ అనే కాంట్రాక్టర్‌తో సుకుమ ప్రాంతంలో కొత్త ఇళ్లకు సున్నం వేయడానికి మూడు రోజుల కిందట వెళ్లాడు. మిగతా వారు పని పూర్తి చేసుకుని వచ్చేశారు. జీతు మాత్రం ఇంటికి రాలేదు. దీంతో జీతు తమ్ముడు మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం మృతదేహం కనిపించడంతో మల్కన్‌గిరి పోలీసు ఐఐసి రీగాన్ కీండో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి పంపించారు.
కొండల్లో కార్చిచ్చు
రాయగడ: రాయగడ నుంచి కెరడ, జిమిడిపేట, బడహంస, పితామహాల్, టెంటాలిగడు, చింతలిగుడ, తడమ, నతమ, మల్లిపొడ, పెరిగాంకు వెళ్లే ప్రాంతాల్లో గల కొండల్లో కార్చిచ్చు రగులుతోంది. పోడు వ్యవసాయం పేరిట ఆదివాసీలు అడవుల్లో మంటలు పెడుతున్నారు. కొండలను తగుల బెట్టవద్దని అటవీ శాఖ ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా వాటిని పెడ చెవిన పెడుతున్న ఆదివాసీలు కొండలను తగులబెడుతున్నారు.
రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హర
Comments
Please login to add a commentAdd a comment