బైక్‌లను తగలబెట్టిన దుండగులు
రాయగడ: జిల్లాలో టికిరి రైల్వేస్టేషన్ సమీపంలోని ఒక అతిథి గృహం వద్ద పార్కింగ్‌లో ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. దీంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అతిథి గృహం యజమాని కె.పవన్ కుమార్ టికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
అదుపు తప్పి లారీ బోల్తా
రాయగడ: కొరాపుట్ నుంచి రాయగడ మీదుగా కర్రల లోడ్‌తో జేకేపూర్ వెళ్తున్న లారీ అదుపుతప్పి స్థానిక కొరాపుట్ కూడలి వద్ద శుక్రవారం బోల్తా పడింది. దీంతో వెదురు కర్రలు ఒక వైపుగా ఒరిగిపోయాయి. డ్రైవరు సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీని జేసీబీ సాయంతో పక్కకు తీసుకొచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
బీఎస్‌ఎఫ్ జవాన్‌కు గాయాలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ రైల్వేస్టేషన్ వద్ద గురువారం రాత్రి రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన బీఎస్‌ఎఫ్ జవాన్ తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే బీఎస్‌ఎఫ్ సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జవాన్‌ను ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో గాయాలుపాలైన జవాన్ అశోక్ కుమార్ మీనాగా గుర్తించారు. కొంధమాల్ జిల్లా బలిగుడలోని 136వ బెటాలియన్ బీఎస్‌ఎఫ్ జవానుగా గుర్తించారు. గురువారం అశోక్ జగదల్‌పూర్–హవడా సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మరో ఆరుగురు జవాన్లతో కలిసి కొరాపుట్ నుంచి మునిగుడ వరకు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మునిగుడ రైల్వేస్టేషన్ సమీపిస్తున్న సమయంలో గేటు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని ఎడమ చేయి పూర్తిగా తెగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment