ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి
జయపురం: ఇళ్ల పట్టాలు అందజేసి న్యాయం చేయాలని స్థానిక క్రిస్టియన్‌పేట మహిళలు కోరారు. ఈ మేరకు జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డిని శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేసి వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్ ప్రణభ కిశోర్ నాయిక్ నేతృత్వంలో మహిళలు సబ్‌కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కిశోర్ నాయిక్ మాట్లాడుతూ.. పట్టాలు లేకపోవడంతో లబ్ధిదారులైన మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్రమాణ పత్రాలను సబ్‌కలెక్టర్‌కు చూపించారు. అయితే నేటి వరకు పట్టాలు సమకూర్చలేదని ఆరోపించారు. ఎంతో కాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో వందమంది లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. అయితే మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో జలాశయం ఉండటం వలన వారికి ఎల్.ఆర్.సి ఇవ్వడం లేకపోతున్నామని తహసీల్దార్ చెబుతున్నారని సబ్‌కలెక్టర్‌కు కౌన్సిలర్ వివరించారు. సమస్యను తెలుసుకొని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ హామీ ఇచ్చారు.సబ్‌కలెక్టర్‌ను కలిసిన వారిలో రింకి నాయిక్, జానకీ నంద, సుభాషిణీ బాగ్, మోహినీబాగ్, కుమారి హియాల్, యరియ హియాల్‌లతో పాటు బిజురాజానగర్, కింద వీధి, కోర్టు కాలనీకి చెందిన మహిళలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment