వయో వృద్ధుల తీర్థయాత్ర ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి నుంచి 72 మంది వృద్ధులు తీర్థయాత్రల పథకం కింద అయోధ్య, కాశీ యాత్రలకు రెండు బస్సుల్లో శుక్రవారం బయల్దేరారు. వీరంతా 6 రోజులు తీర్థయాత్రలు చేసి అనంతరం ఈనెల 13వ తేదీన మరలా స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ బస్సులను జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్, పర్లాకిమిడి పురపాలక సంఘ అధ్యక్షురాలు నిర్మలా శెఠి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ వయోవృద్ధుల తీర్థయాత్ర పథకం ద్వారా ఇప్పటికే గజపతి జిల్లా నుండి బ్యాచ్‌లు వెళ్లాయని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment