విక్రమదేవ్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా మహేశ్వర్ నాయిక్ బ
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా మహేశ్వర నాయిక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాప్రగతికి కృషి చేస్తానన్నారు. విద్యార్థులలో క్రమశిక్షణ నెలకొల్పి ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. మహేశ్వర్ నాయిక్ ఓఏఎస్ అధికారి. బాధ్యతలు చేపట్టిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పూర్వ రిజిస్ట్రార్ రంజన్ కుమార్ ప్రధాన్, విక్రమదేవ్ హయ్యర్, సెకండరీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ లక్ష్యణ పాత్రో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment