హోటళ్లపై విస్తృత దాడులు
రాయగడ: సబ్ కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు అధికారి సుధాంశు భొయ్ నేతృత్వంలో పట్టణంలో గల పలు హొటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 19 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులొ భాగంగా స్థానిక ఇంజినీరింగ్ వర్క్స్ షాపులో అధికారులు నిర్వహించిన దాడుల్లో గ్యాస్ వెల్డింగ్‌లకు సంబంధించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులు వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక గ్రాండ్ డిలెట్ హోటల్‌లో 5, అంబికా హొటల్‌లో 2, నవీన్ హొటల్‌లో 2, జయహనుమాన్ హొటల్‌లో 5, సంతొషి హొటల్‌లో 2, అంగ్రొ ఇంజినీరింగ్ షాపులో మరో రెండు సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బార్ అసోసియేషన్ ఎన్నికలకు 4 నామినేషన్లు
జయపురం: జిల్లా బార్ అసోసియేషన్‌కు జరగనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ పర్వంలో రెండో రోజైన శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలయ్యాయి. తొలి రోజున ఆరు నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. రెండో రోజున కార్యదర్శి పదవికి న్యాయవాది శరత్ కుమార్ మఝి(పింటు) నామినేషన్‌ను ఎన్నికల అధికారి దాసరధి పట్నాయక్‌కు అందజేశారు. ట్రెజరర్ పదవికి శైనేష్ కుమార్ ముదులి, కార్యవర్గ సభ్యుల పదవులకు సురేష్ కుమార్ సెట్టి, తరణి పాణిగ్రహిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు పద్మిణి దాస్, జ్యోతి రంజన్ పూజారి సహకరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో కొరాపుట్ ఎంపీ పర్యటన
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి శంకర్ ఉల్క ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆ ప్రాంత నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. నాగాలాండ్ రాష్ట్ర పీసీసీ కార్యాలయంలో ఉల్క కి ఘన స్వాగతం లభించింది. కోహిమా యుద్ధ వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. త్రిపుర రాష్ట్రం లో ఉల్క పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
హోటళ్లపై విస్తృత దాడులు
హోటళ్లపై విస్తృత దాడులు
హోటళ్లపై విస్తృత దాడులు
Comments
Please login to add a commentAdd a comment