రాష్ట్రంలో అధునాతన పోలీసు ఠాణాలు: సీఎం
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన పోలీసు ఠాణాలు అందుబాటులోకి వస్తాయని, ఠాణాకు విచ్చేసే ప్రతి ఒక్కరికి మౌలిక సౌకర్యాలతో కూడిన సదుపాయాలు రాత్రింబవళ్లు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. స్థానిక నయాపల్లి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మరో 13 పోలీస్ స్టేషన్ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ 14 పోలీస్ స్టేషన్లను రూ. 41 కోట్ల 99 లక్షల 59 వేలు వెచ్చించి నిర్మించారు. పోలీసు అధికారులు మరింత సమర్థంగా విధులు నిర్వహించేందుకు వీలుగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పటిష్టమైన సాంకేతికత వ్యవస్థతతో తీర్చిదిద్దారు. ఠాణాలకు విచ్చేసే వారి పట్ల పోలీసుల సత్ప్రవర్తన అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పోలీసు అధికారులు, సిబ్బందికి హితవు పలికారు. సకాలంలో సముచిత సేవలు అందజేసి న్యాయసమ్మతంగా పోలీసు సేవలు అందజేయాలని తెలిపారు. ఠాణాలో సత్ప్రవర్తన ప్రజల్లో అవాంఛనీయ భయాందోళనలు తొలగించి నేర సంఘటనల నియంత్రణకు తోడ్పడే సానుకూల పరిస్థితులు అక్కరకు వస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో అధునాతన పోలీసు ఠాణాలు: సీఎం
Comments
Please login to add a commentAdd a comment