సమాన హక్కులు కల్పించాలి
జయపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం చైల్డ్ ఫండ్ విభాగం ద్వారా జయపురం సమితి గొడొపొదర్, టంకువ గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ‘మహిళలు– బాలికల అధికారం– సమానత్వం’అనే అంశంపై చర్చ జరిగింది. కార్యక్రమంలో కిశోరీ స్యయం సహాయక గ్రూపు సభ్యులు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, పీఈవో, వార్డు మెంబర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. పీఈవో శునాలీ పండ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళల సాధికారిత, హక్కులు, సమాజంలో సమానత్వంపై ఆమె ప్రసంగించారు. మహిళలు విద్య, ఆర్థిక రంగాలలో ప్రగతి సాధిస్తే సమాజం అభివృద్ధి సాధిస్తోందన్నారు. కార్యక్రమాలలో గొడొపొదర్ పంచాయతీ సర్పంచ్ హీరామణి భూమియ, టంకువ గ్రామ పంచాయతీ సర్పంచ్ రుక్మిణీ గదబ, పీఈవో రమణీరంజన్ త్రిపాఠీ, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ సంధ్యారాణి సతనమ్, హెల్త్ వర్కర్ బందిత తరాసియ, అరుందతీ బిశ్వాస్, సివిల్ సప్‌లై సహాయకులు జగన్నాథ్ హరిజన్, చైల్డ్ ఫండ్ కోఆర్డినేటర్ పూర్ణిమ దాస్, అంశుమాన్ మఝి, సుమన్ కుమార్ నాయిక్, ధార్మికా నాయిక్, సీతామణి హంతాల్, ప్రసన్న నాగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment