ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరణకు బీజేడీ అభ్యర్థన
భువనేశ్వర్: దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతి నాడు జరుపుకుంటున్న పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 24న నిర్వహించేందుకు మార్పు చేసింది. దీంతో బిజూ జనతా దళ్ ఉగ్ర రూపం దాల్చింది. శుక్రవారం ప్రారంభమైన శాసన సభ మలి విడత బడ్జెటు సమావేశాల్లో బీజేడీ సభ్యులు తీవ్ర నిరసన ప్రదర్శించారు. దీంతో సభా కార్యక్రమాలకు గండి పడింది. సభా కార్యక్రమాలు వాయిదా పడడంతో ఊరేగింపుగా బీజేడీ నాయకులు రాష్ట్ర గవర్నరుని కలిసేందుకు రాజ్ భవన్ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నరు డాక్టరు హరిబాబు కంభంపాటికి స్మారక పత్రం సమర్పించారు. మార్చి 3న పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను మార్చి 5 నుంచి ఏప్రిల్ 24కి మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని బీజేడీ ఎమ్మెల్యేలు తమ మెమోరాండంలో కోరారు.
బిజూ పట్నాయక్ జయంతి పురస్కరించుకుని ఏటా పంచాయతీ రాజ్ దివస్‌గా పాటించాలని 1993 సంవత్సరంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందిం. మూడు అంచెల పంచాయతీ రాజ్ సంస్థల సాధికారతపై దృష్టి సారించేందుకు ప్రతీకగా గత 31 ఏళ్లుగా, 1995 నుంచి 2000 వరకు కాంగ్రెస్ పాలనలో, 2000–2009 వరకు బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా రాష్ట్రం ఈ దినోత్సవాన్ని పాటిస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ సంస్కృతికి తెర దించే ఉత్తర్వుల్ని రద్దు చేసేందుకు గవర్నరు కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మంత్రివర్గ నిర్ణయాన్ని రద్దు చేయాలని గవర్నరుకు అభ్యర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment