నవజీవన్ ట్రస్టులో మహిళా దినోత్సవం
పర్లాకిమిడి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న నవజీవన అనాథాశ్రమంలో ‘జస్టీస్ కార్నర్’ట్రస్టు ఆధ్వర్యంలో మహిళల హక్కులపై ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సురక్షా అధికారిని సరలాపాత్రో, జువనైల్ కోర్టు సభ్యులు రవీంద్ర కుమార్ పాల్, మహిళా న్యాయవాది అనితా కుమారీ మిశ్రా, ఆకాంక్ష సంఘటన్ కార్యదర్శి మీనా కుమార్ టోహోలో, శక్తిసాధన్ సూపరింటెండెంటు మంజులా ఆచార్య, సీసీడీ సంస్థ కార్యదర్శి అట్టాడ జగన్నాథరాజు, సఖీ ఒన్ స్టాప్ సెంటర్ సునీతా మహారాణా, అంగన్‌వాడీ, మహిళా స్వయం సహాయక గ్రూపు మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం మనమంతా పోరాడాలని, బాల్యవివాహాలు, గృహహింస, మహిళలపై అనుచిత ప్రవర్తన, అక్రమరవాణా అరికట్టాలని, జసిస్ కార్నర్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి నాయక్ అన్నారు. మహిళలు సమాజంలో మూలస్తంభాలని, వారి స్వశక్తీకరణ, భద్రత కోసం మహిళలంతా కలిసి పనిచేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి అన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, స్వశక్తీకరణపై నిస్వార్థ సేవలకు గాను కవితా మల్లిక్‌కు జసిస్ కార్నర్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి నాయక్ ఆధ్వర్యంలో సత్కారం చేశారు. కార్యక్రమానికి జస్టిస్ కార్నర్ ట్రస్టు సభ్యులు సంజయ్ కుమార్ రౌత్, కార్యదర్శి జగన్నాథ చౌదరి పాల్గొన్నారు.
నవజీవన్ ట్రస్టులో మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment