ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో మంచి అవకాశాలు
రాయగడ: వైద్య రంగంలో పలు సేవలను అందించాలనే ఉద్దేశంతో ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో చదువుకున్న విద్యార్థులు వారి లక్ష్యానికి అనుగుణంగా వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని డాక్టర్ చంద్ర శేఖర్ పాత్రో అన్నారు. స్థానిక పితామహాల్ వద్ద గల సెంచ్యూరియన్ విశ్వవిద్యాలయంలో ఆఖరి సంవత్సరం చదువుకుని వెళుతున్న ఫార్మసీ, నర్సింగ్ విభాగాలకు చెందిన విద్యార్థుల వీడ్కొలు సమావేశం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో ఫార్మసీ విభాగం అధ్యక్షులు డాక్టర్ పాత్రో మాట్లాడారు. ఫార్మసీ, నర్సింగ్ రంగాల్లో ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని వివరించారు. వైద్యరంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ విభాగం అధ్యక్షులు కె.ఉర్మిల, అధ్యాపకులు గొపాలక్రిష్ణ పాఢి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment