క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
విజయనగరం: విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడులు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో జరిగిన స్కూల్‌గేమ్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 28 మంది క్రీడాకారులకు శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, సైక్లింగ్, తైక్వాండో, రెజ్లింగ్ పోటీల్లో రాష్ట్ర జట్లలో 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిని ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారితో పాటు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడల ద్వారా మంచి భవిష్యత్ అందిపుచ్చుకోవచ్చన్నారు. జాతీయస్థాయి సర్టిఫికెట్‌తో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అసోసియేషన్ కార్యదర్శి సన్యాసిరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి ఎన్.వెంకటనాయుడు, ఎస్ జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణంరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కేవీఎఎస్ రాజు, చంద్రశేఖర్, సూర్యారావు, తౌడుబాబు, సత్యనారాయణ, అప్పలనాయుడు, శ్రీను, టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్కూల్‌గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment