ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

Published Sun, Mar 9 2025 12:42 AM | Last Updated on Sun, Mar 9 2025 12:42 AM

ప్రజల

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

త్రుటిలో తప్పిన ప్రమాదం

పాలకొండ రూరల్‌: నిత్యం రద్ధీగా ఉండే స్థానిక ప్రధాన మార్కెట్‌కు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా నేలకొరిగింది. నెలలో రెండవ శనివారం పాఠశాలకు సెలవు కావటం, గోడకు మరోవైపు ఉన్న మార్కెట్‌లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో ఈ భారీ గోడ కూలటంతో చుట్టపక్కల వారు అక్కడి చేరుకుని పరిస్థితిని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ ఘటనతో ఎటువంటి సమస్య తలెత్తకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం బి.శ్రీదేవి శాఖాపరమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

మక్కువ : మండలంలోని పాయకపాడు గ్రామానికి చెందిన సామంతుల స్వామినాయుడు (29) మనస్తాపంతో గడ్డి మందు తాగి, వైద్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వామినాయుడు ఈ నెల 6వ తేదీన ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగడంతో స్థానికులు గమనించి మక్కువలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత కొంతకాలంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామినాయుడు గడ్డి మందు తాగాడు. మృతుడికి వివాహమై ఏడాదైంది. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

పార్వతీపురం రూరల్‌: అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గుంటూరు, కర్నూల్‌ రేంజ్‌కు సంబంధించిన 35మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలను ప్రాక్టికల్‌ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఎస్‌ఐలు ఎస్పీ మాధవ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వారితో మాట్లాడుతూ ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అత్యుత్తమ సేవలందించాలన్నారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంగా సేవలందించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఈ శిక్షణలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టి పోలీసు శాఖ ప్రజలకు మరింత సేవలందించేలా చూడాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మృదు స్వభావంతో మెలగాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు రాయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, కేసులను ఏ విధంగా ఛేదించాలి, సీసీటీఎన్‌ఎస్‌, డ్రోన్స్‌ను ఉపయోగించడం, పెట్రోలింగ్‌, సీసీ కెమెరాలను ఉపయోగించు విధానం, పహారా బీట్‌ గురించి ఎన్‌డీపీఎస్‌ కేసులలో చేయాల్సిన విధులు, కేసు డైరీ రాయడం, నేర స్థల పరిశీలన, పోలీసు బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ విధమైన అనుమానాలు వ్యక్తమైనా సీనియర్‌ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఉన్న పలు పోలీసుస్టేషన్లకు కేటాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ1
1/2

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ2
2/2

ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement