మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ అవార్డు
సీతంపేట: మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ మేరకు అవార్డును కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌బీఐ ప్రతినిధి సతీష్ కె.మల్హోత్ర, ఈఎస్‌ఏఎఫ్ ఫౌండర్ పాల్ జోషెఫ్ చేతుల మీదుగా రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు, మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ బెండి శంకరరావు అందుకున్నారు. ఆర్ట్స్ నేతృత్వంలో మన్యంలోని గిరిజన రైతులు సహజ ఉత్పత్తులను సాగు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment