గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ | - | Sakshi
Sakshi News home page

గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ

Published Sun, Mar 9 2025 12:42 AM | Last Updated on Sun, Mar 9 2025 12:43 AM

గడ్డి

గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ

కొత్తవలస : మండలంలోని అరకు – విశాఖ జాతీయ రహదారిలో నిమ్మలపాలెం జంక్షన్‌ సమీపంలో గల సూర్య ఐటీఐ వద్ద ముందు వెళ్తున్న గడ్డి ట్రాక్టర్‌ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ శనివారం ఢీకొట్టింది. ఎల్‌.కోట మండలం కళ్లేపల్లి నుంచి వరి గడ్డితో ట్రాక్టర్‌పై నుంచి కొత్తవలస వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ తెరుకునే లోపే లారీ అతివేగంగా తప్పించుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సాయంతో గడ్డి ట్రాక్టర్‌ను రోడ్డు సేఫ్టీ పోలీస్‌లు దగ్గరుండి పక్కకు తొలిగించారు.

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం

గజపతినగరం రూరల్‌: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్‌ వైర్లుకు గడ్డి ట్రాక్టరు తగలడంతో దగ్ధమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనకల సూర్యనారాయణకు చెందిన ట్రాక్టరులో ఎండు గడ్డిని ఎక్కించి తీసుకువెళ్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్‌ వైర్లు తగలడంతో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వ్యాపించి గడ్డితో పాటు ట్రాక్టరు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ట్రాక్టరు పూర్తిగా కాలి పోయింది.

కుల దూషణపై అట్రాసిటీ కేసు

బొండపల్లి: మండలంలోని కొత్తపాలెం సచివాలయం వెల్ఫేర్‌ సహాయకుడుగా పని చేస్తున్న ఉద్యోగిపై కుల దూషణ చేసినట్లు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు. ఈ నెల 1న సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసేందుకు యడ్లపాలెం గ్రామానికి చెందిన వెల్ఫేర్‌ సహాయకుడు గొర్లె సతీష్‌కుమార్‌ వెళ్లాడు. మజ్జి అప్పయ్యమ్మ ఇంటికి పింఛన్‌ ఇచ్చేందుకు వెళ్లగా సెల్‌ సిగ్నల్స్‌ పని చేయకపోవడంతో పక్క ఇంటికి వెళ్లి పింఛన్‌ అందించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మా అమ్మకు పింఛన్‌ ఇవ్వకుండా పక్క ఇంటికి ఎందుకెళ్లావు? అని అప్పయ్యమ్మ కుమారుడు బంగారునాయుడు కులం పేరిట దూషించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు.

మిస్సింగ్‌ కేసు నమోదు

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం పట్టణంలో గల ఎస్‌ఎన్‌పీ కాలనీకి చెందిన జె.సత్తిరాజు ఈ నెల 5వ తేదీన ఉదయం 6గంటలకు తన రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ గోవిందరావు శనివారం తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

వధూవరులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్‌

విజయనగరం టౌన్‌/ గంటస్తంభం : విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హిజ్రాస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన శ్రీసత్య – సత్యనారాయణరావు, విజయలక్ష్మి – వెంకటసత్య ఆచారి జంటలకు శనివారం వివాహం జరిపించారు. ఈ వివాహ వేడుకలకు జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, మజ్జి సరిసహస్ర, వర్రి నరిసింహమూర్తి, జైహింద్‌కుమార్‌, ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌, తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సిరి సహస్ర నూతన దంపతులకు పట్టు వస్త్రాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ 1
1/2

గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ

గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ 2
2/2

గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement