ఎన్‌డీఏకు ఎంపికై న విద్యార్థులకు సత్కారం
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యనభ్యసించి, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, జాతీయ రక్షణ అకాడమీ (ఎన్‌డీఏ)లో చేరనున్న 8 మంది విద్యార్థులను కోరుకొండ సైనిక పాఠశాలలో శనివారం ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎస్ శాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 63 ఏళ్ల పాఠశాల చరిత్రలో దేశానికి 744 మందికి పైగా రక్షణ అధికారులను అందించిన ఘనత కోరుకొండ సైనిక పాఠశాల సాధించడం గర్వకారణమని అన్నారు. దేశ రక్షణ రంగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అనేక మంది పాఠశాల పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో సేవలు అందించారని, ప్రస్తుతం అందిస్తున్నారని అన్నారు. ఎన్‌డీఏ, ఐఎన్‌ఏలో చేరడమే లక్ష్యంగా పాఠశాలలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. విద్యార్థుల విజయాల్లో భాగమైన అధికారులు, ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌డీఏకు ఎంపికై న విద్యార్థులు శిరీష్ శాస్త్రి, వర్షిత్ వర్థన్, వై.తేజేశ్వర్, చల్ల కృష్ణకుమార్, రూపేశ్ రోణంకి, ఎం.రోహిత్‌కుమార్, ఎస్.గీత్‌పవన్, కె.భార్గవ్‌లను సత్కరించి అభినందించి జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్ వి.పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎన్.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌డీఏకు ఎంపికై న విద్యార్థులకు సత్కారం
Comments
Please login to add a commentAdd a comment