అంబరాన్నంటిన ఎల్లమ్మ సంబరం...
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడలో ఎల్లమ్మ తల్లి జాతర శనివారం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పెద్ద ఎల్లమ్మ తల్లి అలాగే పక్కనే ఉన్న చిన్నమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం డప్పు వాయిద్యాల నడుమ ఎల్లమ్మ తల్లిని చదురు నుంచి గ్రామ పొలిమేర వరకు మూడుసార్లు ఊరేగించారు.
సిరిమానోత్సవాన్ని పోటెత్తిన భక్తులు
చుట్టు పక్కల ఉన్న 20 గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఎల్లమ్మతల్లి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించి పసుపు, కుంకుమలను సమర్పించుకున్నారు. గ్రామానికి చెందిన సబ్బవరపు అచ్యుతరావు పూజారిగా సిరిమానును అధిరోహించారు. ఎల్లమ్మ తల్లి చదురు నుంచి సతివాడ జంక్షన్ వరకు సిరిమానోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సత్యనారాయణ, నాయకులు కోరాడ శ్రీను, ఆల్తి నల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో సిరిమానోత్సవం
తరలివచ్చిన వేలాది మంది భక్తులు
Comments
Please login to add a commentAdd a comment